Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Thursday, 24 August 2017

Usupodu urukodu( FIDA) Lyrics

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు ఇంతఖైదు నాకిలా ఏమిటో ...
సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో ...
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు ఇంతఖైదు నాకిలా ఏమిటో ...
సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో ...
నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే తప్పేనా ఈ యాతన...
నీ వైపు రావాలనే ఆలా ఉరుకుతోందే ... ఆగేదెలా అరె ఇ ఆలోచనా ...

నీ తలపులే వదలవే నన్ను నిదురలోను... 
ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను ...

వల్లకాదు వాలుపోదు ఆగనిదూ సాగనీదు వెంటరాదు నాకిలా ఏమిటో ...
వేళకాదు వీలులేదు ఊహకాదు ఓర్చుకోదు చెప్పలేదు నాకిలా ఏమిటో ...

నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే తప్పేనా ఈ యాతన...
నీ వైపు రావాలనే ఆలా ఉరుకుతోందే ... ఆగేదెలా అరె ఇ ఆలోచనా ...

నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ...
ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను ...

నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదోనాడు నీతో చెప్పేయనా ...
నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయి ...
ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలవనిదే ...
ఏదోనాడు నీతో చెప్పేయనా ...

నీ తలపులే వదలవే ... నీ తలపులే వదలవే ...
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు ఇంతఖైదు నాకిలా ఏమిటో ...

Nilavade madi nilavade(Shatamaanambhavathi) lyrics

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ...
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ... దేవదాసే కాళిదాసై ...
ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది ...
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ...
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ...

అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి ...
అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి ...
నువ్వు నడిచే దారులలో పులగంధాలే ఊపిరిగా ...
జతనడిచే మనసుకదే హాయి రాగాల ఆమనిగా ...
దినమొకరకముగా పెరిగిన సరదా నిను విడి మనగలదా ...

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ...
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ...

ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు ...
నేనే ప్రేమలేఖగా మారి ఎదుటే నిలిచాను ...
చదువుకునే బదులిదని చెప్పుకోలేవులే మనసా ...
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష ...
తెలుపక తెలిపిన వలపోక వరమని కడలిగా అలలెగసా ...

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ...
ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ... దేవదాసే కాళిదాసై ...
ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది ...

Wednesday, 9 August 2017

Adhey nanne (Surya s/o Krishnan) lyrics...

అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ... ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల ...
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా ... అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ...
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా ...
అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ... ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల ...
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా ... అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ...
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా ...
ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే ...
అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే ...
అది ఒకే మాట అన్న భలే మిసిమి  బంగరు మూట ...
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న ...
ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే
అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే ...

అడివిని గుర్రమల్లె అట్టా తిరిగిన నన్నే ...
ఒక పువ్వులాగా పువ్వులాగా మార్చివేసింది ...
పడకలో తొంగుంటేనే నా కలలే చెరిగే ...
ఆమె సోయగాలు నవ్వి పోయే ముత్యం లాగా ...
ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క ...
ఓ దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామె ...
కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి నీకై నేనే వెతుకుతూ ఉన్న ...
తనుగా ఏ వైపెల్లిందో తనుగా ఏ వైపెల్లిందో తనుగా ఏ వైపెల్లిందో ...

అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా ... ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల ...
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా ... అరె  ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ...
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా ...

బతుకే రాట్నం లేరా తెగ తిరుగును లేరా ...
అది పైనాకింద పైనాకింద అవుతది కదరా ...
మొదట పైకెగిరాను నే బోర్లాపడ్డ ...
కొర్రమీను  మల్లెమడుగు విడిచి తన్నుకు చచ్చా ...
ఎవరో కూడ వస్తారు ఎవరో విడిచిపోతారు ...
అది ఎవరు ఎందుకన్నది మన చేతులో లేదే ...
వెలుగుల దేవత ఒకతె ఏదనే కలవర పరిచి ఏదో మాయం చేసి ...
తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో తానే ఏమైపోయిందో...