Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Saturday, 8 October 2016

RA RA KUMARA (GOVINDUDU ANDARIVADELE) LYRICS



రా రా కుమారా రాజసాన ఏలరా ...
ఎదపై చేరనీరా పూలమాలే నేనుగా ...
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో ...
పంపుతున్న నా ప్రాణాన్నే నీ వైపుగా ...

నీ పిలుపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే... 
నీ పెదవులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే ...
కలలే నిజమైనా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం ...
నిజమే కల అయినా ఒళ్ళు మరిచిన  ఆ అయోమయం మరింత ఇష్టం ...

రా రా కుమారా రాజసాన ఏలరా ...

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలని ...
బ్రతకడమంటూ ఎంత మధురం ఇ చేతులలో తెలియని ...
నేనేం చేసుకోను నీకు పంచని ఇ హృదయాన్ని ...
ఇంకేం కోరుకొను నిన్ను మించిన మరో వరం ఏదైనా గాని...








 

VADHANTUNE (RUN RAJA RUN ) LYRICS



వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా...
కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణం ఇచ్చేంతగా నాకు నచ్చావురా ...
ఉన్నమాటిది నిజమున్నమాటిది , అన్నమాటిది మనసన్నమాటిది ...
ప్రేమగా నిను చేరగా ఆరాటపడుతుంది ...


నాలోనే ఉన్నా తెలియలేదు ఏ సడి లేని అలజడి ...
గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీ వైపు పరుగులు తీసిందిలా ...
ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసిది  ...
నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది  ఈరోజిలా ...
చూస్తూ చూస్తూనే నేను నీ సొంతం అయినా ,గుర్తించలేదే కన్ను ఇ కొంచమైనా...
వెన్నెల్లో నేనే నేను నిన్నిల్లా  ప్రేమిస్తున్నా నీ మాయ దయవలనా ...
I am in love Baby I am in love Baby I am in love Baby I am in love 
I am in love Baby I am in love Baby I am in love Baby I am in love

నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల్లో పువ్వయిన్ది ...
నీలో అదేదొఉంది నన్నేదో చేసేసింది నా చుట్టూ లోకం నీల కనిపిస్తుంది ...
నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోన తేలే గువ్వయింది ...
నువ్వంటే తెలిసేకొద్దీ నీలో నేనూ కలిసేకొద్దీ నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తుంది ...
నీ నీడలోనే  నాకు ఆనందముంది నూరేళ్లకు నేను నీలోన బందీ ...
ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక... 
నీ లోన సగమవనా ...

వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా...
కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణం ఇచ్చేంతగా నాకు నచ్చావురా ...
ఉన్నమాటిది  నిజమున్నమాటిది , అన్నమాటిది మనసన్నమాటిది ...
ప్రేమగా నిను చేరగా ఆరాటపడుతుంది ...









































Saturday, 1 October 2016

AAJA SAROJA (AAGADU) LYRICS


హల్లో  హల్లో నీ ఊహల్లో ఎగేరేస్తున్నవే ...
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే ...
గుళ్లో గంటై నా గుండెల్లో మోగేస్తున్నవే ...
బళ్ళో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నవే ...
పండగల్లె మార్చుకుంట నువ్వు నేను కలుసుకున్న తేదీ ...
ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్నా పెద్ద పండగేది ...
తూ ఆజా సరోజ , తూ లేజా సరోజ ...
తూ ఆజా సరోజా  , తూ లేజా సరోజ ...
హల్లో  హల్లో నీ ఊహల్లో ఎగేరేస్తున్నవే ...
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే ...


కనురెప్పల దుప్పటిలో  ,
నిన్ను వెచ్చగా దాచుకుంటే ముద్దుగా చూసుకుంటా ఒకటిరెండు మూడుపూటలా ...
నా పెదవుల అంచుల్లో  ,
నిన్ను మాటలా మార్చుకుంట నవ్వులా పెంచుకుంట పాడుకుంట కొత్తపాటలా ...
మసక్కలి మైకం లోన  మే  దీవానా , మనస్సాగనంటున్నదే ఎంత ఆపిన ...
రెండు మూడు చాలవంట నాలుగైదు కావాలి కళ్ళు ...
ఇంత అందమైన పిల్ల సొంతమైతే ఆగదే ఇల్లు ...
తూ ఆజా సరోజ...


నీ అడుగుల సడి వింటే ,
ఎంత మొద్దు నిద్దరైనా గాని  నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తేలిపోతాదే ...
నువ్వు ఎదురుగ వస్తుంటే  ,
ఆ నింగిలోని చందమామ దారితప్పి నేలమీదకొచ్చినంత వింతగున్నదే ...
అయస్కాంతం ఎదో నీలో దాగున్నదే , అదోరకం అలజడిలోకి లాగుతున్నదే ...
కళ్లనుంచి గుండెల్లోకి బందిపోటు దొంగలాగా దూకి ...
కొల్లగొట్టి పారిపోకే ముక్కు పిండి తీర్చుకొన బాకీ ...

తూ ఆజా సరోజ , తూ లేజా సరోజ ...
తూ ఆజా సరోజా  ,  తూ లేజా సరోజ ...













 

MANASUNA PUTTINA PATA (PREMALO PADITHE) LYRICS


మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా  ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...
మది తలుపు తెరిచేలా వేచి వేచి చూడన , తుదివరకు నిలపడనా వలపుల గడపన ...
మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా  ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...


ఎడారిలో తేనె మేఘం ఎదురు వచ్చే నేడే ...
యదె ఇలా తిపితోటి భారమాయనే ....
పెదాలలలో ప్రతి పదం పక్షి లాగా మారే ...
కన్నెపుల కొమ్మపైకి ఎగిరిపోయెనే ...
విరహపు వేడికి వాడిమాడి  పోయి గాయమైన జ్ఞాపకాలలో ...
 తొలకరి జల్లుల చినుకలాగా ఆపే ఆశ అంచులో ....
చల్లని నిన్నే చూడగా ,  తల్లిని చుసిన సంబరం ....
చూపుతో చెయ్యనా  చుట్టరికం.....
మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా  ... వినపడునా...


గులాబీల కమ్ముకున్న శ్వాస పరిమళాలే ...
గుబాళింపు తోటి చిన్ని గుండె కోసెనే ....
ప్రవాహమై దూకుతున్న  పట్టు కురులు నేడే ...
ప్రమాదమై నన్ను ముంచి ముందు కెళ్ళేనే ...
చితిలో నీచెల్లి నవ్వు నన్ను తాకి బ్రతుకు మీద కోరికొచ్చేనే ...
నతిలో తన చెయ్యందుకుంటే చాల్లే స్వర్గమెందుకో ....
తనకే లేదిక పోలిక , తనకేమివ్వను కానుక ....
ప్రాణమే ఇవ్వన కాదనక ...


మనసున పుట్టిన పాట చెలియా నీకే వినపడునా  ... వినపడునా...
అడుగులు సాగిన బాట ఆగే లోగ చెలియా నీకే కనపడునా ...కనపడునా ...