హొయ్ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా ...
అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా ...
చాలులే నీ నటన సాగదే ఇటు పైనా ...
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనే లలనా ...
దరిచేరిన నెచ్చెలి పైన దయ చూపవ కాస్తయినా ...
మన దారులు ఎప్పటికైనా కలిసెనా ఓ ఓ ఓ ...
హో కస్సుమని కారంగా కసిరినది చాలింక ...
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా ...
కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా ...
కనులవెనకే కరిగిపోయే కలవి కనుక ...
నను గొడుగై కాసై నువ్వు పిడుగులు కురిపిస్తావా ...
నువ్వు గొడుగున ఎగురేస్తావే జడివాన హొ ...
ఓ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా ...
అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా ...
తిరిగి నిను నా దాకా చేర్చినది చెలిమేగా ...
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చేరగదు గనుక ...
సులువుగా నీ లాగా మరిచి పోలేదింకా ...
మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక ...
ఎగిసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా ...
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో ...
హ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా ...
అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా ...
No comments:
Post a Comment