Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Saturday, 3 February 2018

Kala Yedo(Majnu) Lyrics

కల ఏదో నిజమేదో తెలియదే మరి అలా ... 
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా ... 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఎలా ... 
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా ... 
నా మాట వినదు మనసు ఏంటిలా ... 
కుదురుగా కాసేపు ఉండనీదు లెయిల ...
పదే పదే ఇదే నీ వల్లనే ... 
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా ... 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఎలా ... 

జోరే పెంచావే గుండె లయలలోన నువ్విలా ... 
దారే మార్చావే ఏదో మాయ చేసేలా ... 
వాలుకనులలోన దాచేసినావా ... 
ఆ నింగిలోన లేదు నీలము ... 
హాయి లోయలోన తోసేసినావా ... 
ఇవేళ నీ ఇంద్రజాలం ... 
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా ... 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఎలా ... 

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసెనులే ... 
నేనే నీ నవ్వు తలుచుకున్న వేళలో ... 
ఆ చల్లగాలిలాగా నీ ఊసులేవో ... 
మెల్లిగానే నన్ను గిల్లిపోయే ... 
నీలి మబ్బులాగా నా ఆశలేవో ... 
పైపైన నింగిలోన తేలే ... 

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా ... 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఎలా ... 
పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా ... 
నా మాట వినదు మనసు ఏంటిలా ... 
కుదురుగా కాసేపు ఉండనీదు లెయిల ...
పదే పదే ఇదే నీ వల్లనే ... 
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా ... 
అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఎలా ... 

No comments:

Post a Comment