మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే ...
తడవగా నేనేం చేయనూ ...
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయనూ ...
ఓహో మెత్తనైన దుధల్లే ఎగిరేటి నా మదిని ...
ఆపేది ఎట్టాగ ఓదార్చేదేట్టాగ ...
ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే ...
నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను ...
నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం ...
తడబడుతూ నిలిచే ఆ హృదయం ...
మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే ...
తడవగా నేనేం చేయనూ ...
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయనూ ...
మిసమిస కళ్ళతో మదినే తొలిచెనే బాధైనా ఏదో సుఖం...ఏదో సుఖం...
బుగ్గలసొట్టలో కొలువుందన్నది విలువైనా దివ్యవరం ...
ఓహో వెన్నెలొలుకు వేళల్లో కలలు కానేకాలంలో ...
చెలియా తానే వచ్చెనులే చెంత చేరుకున్నదిలే ...
హో రెప్ప మూతపడకుంది నిద్దరసలు రానంది ...
అదే గనక ప్రేమైతే చెలియవలన కలిగింది ...
అడుగేసేముందు అడుగుతీసేవేనుక ...
ఆణువణువూ నీ జ్ఞాపకం ...
కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ ...
వర్షం వస్తే నీరే చేరును భూమిలోన ...
కళ్ళకు గంతలు కట్టిన కూడా పూలనే వెతుకును తేనెటీగ ...
వర్షం వస్తే నీరే చేరును భూమిలోన ...
హే ఎటునువ్వు నిలుచున్నావో అటే నేను చూస్తుంటాను ...
ముందు వెనక నీ నడకల్లో ఊయలలుగా ...
ఆడే నెమలి నీ పించం నా మీదే ...
సుఖమే కలిగి ఇకపైనా జీవితమే ...
మబ్బులు కమ్మేలే చినుకులు చిందేలే ...
తడవగా నేనేం చేయనూ ...
మధువనం విరిసెలే మధురము పొంగేలే
మతి పోతే నేనేం చేయనూ ...
ఓహో మెత్తనైన దుధల్లే ఎగిరేటి నా మదిని ...
ఆపేది ఎట్టాగ ఓదార్చేదేట్టాగ ...
ఓ కడలి వన్నె కన్నులతో నన్ను ముంచి వెళ్ళేనులే ...
నన్ను కోలుపోయాను అయినమేలు అన్నాను ...
నిప్పుమీద కొంచం నీటిమీద కొంచం ...
తడబడుతూ నిలిచే ఆ హృదయం ...
No comments:
Post a Comment