Featured post

KALLALO UNDI PREMA- CURRENT THEEGA LYRICS

కళ్ళల్లో ఉంది ప్రేమ గుండెలో ఉంది ప్రేమ ....  మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మ ...  సొగసులా రొజకొమ్మ ముల్లులా గుచ్చ...

Monday, 2 April 2018

Kadasaridi Veedkolu (Amrutha) Lyrics

కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు ... 
అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ... 
ఆశను సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ ... 
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ ... 
కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు ... 
అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ... 
ఆశను సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ ... 
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ ... 

తల్లినేలని పల్లెసీమని విడతరమా తరమా ... 
తల్లినేలని పల్లెసీమని విడతరమా తరమా ... 
ఉన్నఊరిలో ఉన్నసౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా ... 
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం ... 
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం ... 
కదిలే నదులారా కలలే అలలౌనా ... 
జనని జన్మభూమి స్వర్గాదపీ గరీయసి ... 
కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి పేగు... 
కనలేక కదిలిపోయెను ... 
కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు ... 
అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ... 
ఆశను సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ ... 
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ ... 

పాడే జోలలు పాపాల ఏడ్పుల పాలైపోతే ... 
పాడే జోలలు పాపాల ఏడ్పుల పాలైపోతే ... 
ఉదయసూర్యుడే విలయ ధూమపు తెరలోదాగే ... 
పులడోల నిన్నటి నిలలా ముల్లుకదా ఇప్పటినడక ... 
ఉసురే మిగిలుంటే మరలా దరిచేరవా ... 
మనసే మిగిలుంటే ఒడిలో తలదాచవా ... 
తలపే అల్పం తపనే అధికం ... 
బరువెక్కిన హృదయం మోసుకుమేం పోతున్నాం... 

కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు ... 
అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ... 
ఆశను సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ ... 
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ ఓ ... 

No comments:

Post a Comment